Site icon HashtagU Telugu

Congress : బీహార్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న కాంగ్రెస్‌

Congress

Congress

భారత్‌ జోడో యాత్ర తరహాలో డిసెంబర్‌ 28 నుంచి బీహార్‌లో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్ తెలిపారు. బీజేపీ మతతత్వ ఎజెండాకు వ్యతిరేకంగా 1200 కిలోమీటర్ల మేర పాదయాత్ర బంకా జిల్లా నుంచి ప్రారంభమై బోద్‌గయాలో ముగుస్తుందని చెప్పారు. ఇది రాష్ట్రంలోని 17 జిల్లాలను కవర్ చేస్తుంది. అయితే రాహుల్ గాంధీ బీహార్‌లో రాష్ట్రవ్యాప్త పాదయాత్రలో పాల్గొనే అవకాశం లేదన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రపై ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ నేత‌లు ఆందోళన చెందుతున్నారని జైరాం ర‌మేష్ అన్నారు. బీహార్‌లో కాంగ్రెస్ సీనియర్ నేతలు, మంత్రులు, శాసనసభ్యులందరూ రాష్ట్రవ్యాప్త పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు.