Site icon HashtagU Telugu

Congress: ఎన్నికల ముందు కీలక నిర్ణయం

Template (17) Copy

Template (17) Copy

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో ఎలాంటి పెద్ద ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయించింది. ఇకపై వర్చువల్‌ ర్యాలీలే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

యూపీ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ సీనియర్ నేతలు చర్చించి.. ప్రజా భద్రత దృష్ట్యా బహిరంగ ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్, ఉత్తరాఖండ్​, గోవా, మణిపుర్​లోనూ ఇదే తరహా విధానాన్ని అనుసరించనున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ తెలిపారు.