Congress President Polls : ప్రశాంతంగా ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక..జాతీయ అధ్యక్షులెవరో..?

కాంగ్రెస్ అధ్యక్షపదవికి సోమవారం ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 96శాతం ఓట్లు పోలయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Congress

Congress

కాంగ్రెస్ అధ్యక్షపదవికి సోమవారం ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 96శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు అయిన మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల ఫలితాలు బుధవారం ( అక్టోరబర్ 19న ) వెలువడనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలంగా ఓటు వేశారు. సోనియాగాందీ,మన్మోహన్ సింగ్ తోపాటు సీనియర్ నేతలు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఓటును వినియోగించుకున్నారు. 96శాతం ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.

భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ కర్నాటకలోని బళ్లారిలో ఓటు వేశారు. ఆయనతోపాటు దాదాపు 40మంది ఓటును వినియోగించుకున్నారు. ఈఎన్నికలు ప్రశాంతంగా, పాదర్శకంగా జరిగినట్లు పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ తెలిపింది. అక్టోబర్ 19 సాయంత్రంలోగా కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తామని వెల్లడించింది.

  Last Updated: 18 Oct 2022, 06:10 AM IST