ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఈ ఎన్నికల ప్రచారం కొనసాగగా…సుదీర్ఘ చరిత్ర కలిగిన హస్తం పార్టీని ముందుండి నడిపించే నాయకుడు ఎవరనేది నిర్ణయించనున్నారు. 9వేల మంది ప్రతినిధులు ఓట్లు వేయనున్నారు. దేశవ్యాప్తంగా 36పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 6 ఉత్తరప్రదేశ్ లోఉన్నాయి. ఒకో బూత్ లో 200 ఓట్ల వేయనున్నారు. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 137ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నియామకం కోసం ఆరోసారి ఎన్నికల బరిలోకి దిగబోతోంది. కాగా అధ్యక్ష బరిలో మల్లిఖార్జున ఖర్గే..శశిథరూర్ నిలిచారు.
congress president election voting : ఇవాళే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక..!!

Telangana Congress