Site icon HashtagU Telugu

UP Polls: ట్రెండింగ్ పాలిటిక్స్.. హ‌స్తానికి హ్యాండ్ ఇచ్చిన పోస్ట‌ర్ గ‌ర్ల్

Congress

Congress

దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీకి వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా, ప్రియాంక గాంధీ ప్ర‌తిష్టాత్మ‌కంగా ల‌డ్‌కీ హూ, ల‌డ్‌శ‌క్తీ హూ అనే నినాదంలో ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ క్యాంపెయిన్‌లోని పోస్ట‌ర్ గ‌ర్స్ వ‌రుస‌గా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. ఇటీవ‌ల క్యాంపెయిన్‌లో పాలుపంచుకున్నఇద్ద‌రు పోస్ట‌ర్ గ‌ర్ల్స్ ప్రియాంక మౌర్య‌, వంద‌నా సింగ్‌లు ఇటీవ‌ల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజా మ్యాట‌ర్ ఏంటంటే.. ల‌డ్‌కీ హూ, ల‌డ్‌శ‌క్తీ హూ క్యాంపెయిన్‌లో పాల్గొన్న మ‌రో పోస్ట‌ర్ గ‌ర్ల్ ప‌ల్ల‌వి సింగ్ కూడా హ‌స్తానికి హ్యాండ్ ఇచ్చి, క‌మ‌లం గూటికి చేరారు. దీంతో యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీకి వ‌రుసగా ఊహించ‌ని షాక్‌లు త‌గులుతున్నాయి. ఇక పార్టీ వీడిన పోస్ట‌ర్ గ‌ర్ల్స్ కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ టికెట్ల కేటాయింపులో గోల్‌మాల్ జ‌రిగింద‌ని, ప్ర‌చారం కోసం వాడుకుని, పార్టీ టికెట్ మాత్రం వేరొక‌రికి ఇచ్చార‌ని ఆరోపించారు.ఆరేళ్లుగా కాంగ్రెస్ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేసినా ప్రియాంకాగాంధీతో మాట్లాడే అవకాశమే రాలేదని, దీంతో ఇక‌ముందు పార్టీలో కొన‌సాగ‌డం అన‌వ‌స‌ర‌మ‌ని భావించి, బీజేపీలో చేరామ‌ని పోస్ట‌ర్ గ‌ర్ల్స్ వెల్ల‌డించారు.