Khammam Congress Meeting : ఖమ్మంలో ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ జనగర్జన సభ జరగనుంది. ఇందులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు విమానంలో ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 5 గంటలలోగా ఖమ్మంలోని బహిరంగ సభ ప్రాంగణానికి రాహుల్ రానున్నారు. రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు టీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.
కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పాదయాత్ర ఆదివారం ఖమ్మంలో ముగియనుంది. ఈ సందర్భంగా ఖమ్మం జనగర్జన సభ (Khammam Congress Meeting) వేదికగా భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ సత్కరించనున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా ఇతర ముఖ్య నేతల చేరిక సభగా ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జనను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం చేరుకున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. జనగర్జన సభకు ముందు రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకునే సమయంలో యువజన కాంగ్రెస్ నేతలు భారీ బైక్ ర్యాలీ ప్లాన్ చేశారు. ఆ ర్యాలీలో రాహుల్ గాంధీ పొల్గొంటారు.
Also read : Elon Musk: ట్విట్టర్ యూజర్లకు బిగ్ షాక్.. పరిమితులు విధిస్తూ మస్క్ షాకింగ్ ట్వీట్..!