Site icon HashtagU Telugu

Cong Padayatra:జనవరి30 నుండి కాంగ్రెస్ పాదయాత్ర

జనవరి 30 నుంచి కాంగ్రేస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయనున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ పాదయాత్ర భూదాన పోచంపల్లి నుంచి మహారాష్ట్ర లోని సేవాగ్రాం వరకు పాదయాత్ర జరగనుంది. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు.

తెలంగాణలో భూ సమస్యలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం లోని వాళ్లే ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారని,ధరణి పేరుతో పేదప్రజలు తీవ్ర వేధింపులకు గురవుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

నెల రోజులుగా ధాన్యం కళ్లాల్లో ఉంటే కొనుగోలు చేయకుండా టీఆర్ఎస్ బీజేపీ నేతలు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని, ధాన్యం కొనబోమని లేఖ రాసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు డ్రామా లు చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందం తాజ్ మహల్ ను సందర్శించారా అని ఎద్దేవా చేసారు. వీళ్ల డ్రామా వల్ల రైతులు 1400 లకే క్వింటాలు కు ధాన్యం అమ్ముకున్నారని, ఈ కుంభకోణంలో సీఎం కేసీఆర్ కుంటుబ హస్తం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.