వరి సేకరణ, ఎరువుల ధరల పెంపుపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. వరి సేకరణ విషయంలో రైతులతో ప్రభుత్వం రాజకీయాలు చేయొద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన లేఖలో ఆరోపించారు. వరి కొనుగోలు విషయంలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచడం సరికాదన్నారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లు కౌంటర్ ఇచ్చిన వెంటనే, సిఎంకు కోమటిరెడ్డి లేఖ రాయడం చర్చనీయాంశమవుతోంది.
రైతుల నుంచి వరి కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో పేర్కొన్నారని, టీఆర్‌ఎస్, బీజేపీలకు రైతుల కష్టాలు తెలియవని, వాటిపై రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ హయాంలో రైతుల నుంచి వరిధాన్యాన్ని కొనుగోలు చేసేంత వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.