Site icon HashtagU Telugu

Telangana: జగ్గారెడ్డి ఎక్కడ? : హరీష్

Telangana

Logo (20)

Telangana: తెలంగాణ కాంగ్రెస్ హడావుడితో అధికార పార్టీ బీఆర్ఎస్ లో కాస్త ఆందోళన కనిపిస్తుంది. ఢిల్లీ అధినాయకత్వం తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెట్టడంతో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో టీకాంగ్రెస్ సీడబ్యుసీ మీటింగ్ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కనిపించకుండాపోయాడని, ఆ ఎమ్మెల్యే అడ్రస్ లేడని, ఎక్కడున్నాడో కూడా తెలియదని సెటైరికల్ కామెంట్స్ చేశాడు. దేశాన్ని కాంగ్రెస్ 60 సంవత్సరాలు పాలించిందని. అయినా ప్రజలకు ఒరిగిందేమి లేదని హరీష్ రావు చెప్పారు. అబద్దాలతో తెలంగాణ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ది మాటల పార్టీ అయితే, కేసీఆర్ ది చేతల ప్రభుత్వమని అన్నారు. సీఎం కేసీఆర్ మతాలకు అతీతంగా పని చేస్తున్నారని హరీష్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యటిక్ కొడుతుందని చెప్పారు.

Also Read: One Election : ఒకే ఎన్నిక‌, ఒకే దేశం అడుగు ముందుకు..