Site icon HashtagU Telugu

Donkey Theft: ’డాంకీ‘ పాలిటిక్స్.. కాంగ్రెస్ యువనేత అరెస్టు!

Venkat Imresizer

Venkat Imresizer

గాడిద దొంగతనం ఆరోపణలపై తెలంగాణ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు వెంకట్ బల్మూర్‌ను అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న రాష్ట్రవ్యాప్తంగా గాడిద ముందు కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ నాయకుల ఫిర్యాదు మేరకు బల్మూర్‌ పోలీసులు గురువారం రాత్రి హుజూరాబాద్‌ పట్టణంలో అరెస్టు చేశారు.

శాతవాహన యూనివర్శిటీ సమీపంలో గాడిద ముఖంపై కేసీఆర్ చిత్రపటాన్ని ఉంచి ఎన్ ఎస్ యూఐ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారని, దాని ఆధారంగా అధికార పార్టీ నేతలు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేసినందుకు.. తప్పుడు వాగ్దానాలకు, బూటకపు ప్రచారాలకు..’ అంటూ కేసీఆర్ జన్మదినం సందర్భంగా బల్మూర్ గాడిద చిత్రాలతో ట్వీట్ చేశారు. మొత్తం ఆరుగురు కాంగ్రెస్ నేతలపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బల్మూర్ వెంక‌ట్‌ ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు.

Exit mobile version