Site icon HashtagU Telugu

మార్ఫింగ్ ఫోటోలు వైరల్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వీహెచ్ హ‌ల్‌చల్

Kcr Jaggareddy Vh

Kcr Jaggareddy Vh

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఫిర్యాదు చేశారు. అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. సోషల్ మీడియాలో తనపై త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని, తనని, జగ్గారెడ్డిని కేసీయార్ పక్కన పెట్టి టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి ఉన్నఫొటోలు పోస్ట్ చేయడం పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు చర్యలు తీసుకోవాలని వీహెచ్ పోలీసుల్నికోరారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో హనుమంతరావుకు, సీఐకి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుందని స‌మాచారం. ఈ క్ర‌మంలో మార్ఫింగ్ చేసిన ఫొటోల‌ను సీఐకి చూపించి, త‌న ఫొటోలు మార్ఫింగ్ చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వి.హ‌నుమంత‌రావు సీఐని కోరారు. ఇక‌ సీనియర్ నేతలను బయటకు పంపాలన్న కుట్ర జరుగుతుందని ఆరోపిస్తూ.. రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.