Site icon HashtagU Telugu

MSR: జగన్ కు ‘మర్రి’ ప్రశంస

Marri Shashidhar Reddy

Marri Shashidhar Reddy

కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ సర్కార్ చేసిన కసరత్హు ను కాంగ్రెస్ సీనియర్ నేత , భారత ప్రభుత్వ NDMA మాజీ వైస్ ఛైర్మన్, మర్రి శశిధర్ రెడ్డి ప్రశంసించారు. తెలంగాణలో జరిగిన జిల్లాల ఏర్పాటును తప్పుబట్టారు. సామాజిక , ఆర్థిక , భౌగోళిక అంశాలను అధ్యయనం చేసి ఏపీ జిల్లాల పెంపు జరిగిందని అభిప్రాయ పడ్డారు. అదే తెలంగాణలో జిల్లా ఏర్పాటు అసమానతలు పెరిగేలా, రాజకీయ చైతన్యం లేకుండా ఉండేలా చేశారని భావిస్తున్నారు. ఆ మేరకు ఆయన ఒక లేఖను విడుదల చేసారు. ఆ లేఖ ఇలా ఉంది..

‘2014లో రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు ఉండేవి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం 1974లోని నిబంధనల ప్రకారం, మొత్తం జిల్లాల సంఖ్యను 26కి తీసుకొని 13 కొత్త జిల్లాలను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదించింది. మెరుగైన పరిపాలన మరియు దానిలో ఉన్న ప్రాంతాల అభివృద్ధి ప్రయోజనాల కోసం జిల్లాల ప్రాంతాలు లేదా సరిహద్దుల మార్పుకు వీలు కల్పించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించబడింది.
కొత్త జిల్లాల మధ్య అసెంబ్లీ స్థానాల సంఖ్య, ఇతర అంశాల పరంగా కొంత సమానత్వం ఉండేలా సహేతుకమైన కసరత్తు జరిగిందని నేను భావిస్తున్నాను. భౌగోళిక ప్రాంతాలు, జనాభాకు కూడా వెయిటేజీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. విజయవాడ జిల్లా కి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టె ప్రతిపాదన చేయడంతో కులతత్వ రాజకీయాలను గట్టిగా ప్రోత్సహించిన వైస్సార్సీపీ మరియు ముఖమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలచనలో కొంత మార్పు కనబడుతుంది.
పుట్టపర్తిని కేంద్రంగా కొత్త శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయడం కూడా చాలా స్వాగతించదగినది. తెలంగాణలో జిల్లాల సంఖ్యను కూడా సీఎం కేసీఆర్ 2016లో 10 నుంచి 31 కి, చివరకు 33 కి పెంచారు. ఏపీలో ప్రతిపాదించిన దానికి భిన్నంగా తెలంగాణలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా సీఎం కెసిఆర్ కేవలం తన ఇష్టారాజ్యంగా చేసారు. ఫలితంగా జిల్లాల మధ్య చాలా అసమానతలు ఉన్నాయి, వాటిలో కొన్ని మెరుగైన పరిపాలన మరియు అభివృద్ధి అనే ప్రాథమిక లక్ష్యం నెరవేరకుండా చాలా అధ్వాన్నంగా మారాయి. చిన్న జిల్లాలతో రాజకీయ నాయకత్వాన్ని బలహీనపరచడం, వారి ప్రభావాన్ని తగ్గించడం ప్రధానలక్ష్యంగా ఉన్నట్లు స్పష్టంగా కనబడింది.
గతంలో 1980లో డాక్టర్ మర్రి చ్చ చెన్నా రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసారు. కర్నూలు మరియు గుంటూరు జిల్లాల నుండి కొంత విస్తీర్ణాన్ని కలుపుకొని ప్రకాశం జిల్లాని, విశాఖపట్నం మరియు శ్రీకాకుళం జిల్లాల నుండి కొంత విస్తీర్ణాన్ని కలుపుకొని విజయనగరం జిల్లాని ఏర్పాటు చేసారు. మరియు అప్పుడున్న హైదరాబాద్ జిల్లా లో హైదరాబాద్ పట్టణం చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాన్ని రంగా రెడ్డి జిల్లా గా ఏర్పాటు చేసారు.’ఇలా రెండు రాష్ట్రాల్లో జరిగిన జిల్లాల ఏర్పాటుపై మర్రి తన లేఖలో పొందుపరిచారు.

Cover Pic Courtesy- Wikipedia/MarriShashidhar Reddy