Feroz Khan : కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పనిమనిషి దారుణ హత్య

అనుమానంతో తన భర్తే హత్య చేసి ఎవరికి తెలియకుండా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాడు

Published By: HashtagU Telugu Desk
Feroz Khan Maid Brutally Mu

Feroz Khan Maid Brutally Mu

కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ (Feroz Khan) ఇంట్లో పనిచేసే పనిమనిషి దారుణ హత్యకు గురి కావడం చర్చగా మారింది. గత కొంతకాలంగా ఆస్మా బేగం..ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ వస్తుంది..కాగా శనివారం ఈమె దారుణ హత్యకు గురైంది. అనుమానంతో తన భర్తే హత్య చేసి ఎవరికి తెలియకుండా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

We’re now on WhatsApp. Click to Join.

అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వచ్చి అతడిని నిలదీయడంతో మృతదేహం చెత్త డబ్బాలో దొరికింది అని చెప్పుకొచ్చాడు. దీంతో అక్కడి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడు మహమ్మద్ హసన్ ను గట్టిగా నిలదీయడం తో తానే కత్తితో పొడిచి చంపినట్లు ఒప్పుకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also : Mohammed Shami: మహమ్మద్ షమీ ఎంట్రీకి సిద్ధం, ఎన్సీఏ అప్డేట్

  Last Updated: 10 Aug 2024, 05:32 PM IST