Site icon HashtagU Telugu

Digvijaya Singh: దిగ్విజ‌య్‌కు హెర్నియా ఆప‌రేష‌న్‌

67

67

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ హెర్నియా ఆపరేషన్ కోసం ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేరారు.మంగళవారం ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్‌లో రాజ్యసభ ఎంపీకి హెర్నియా ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. సింగ్‌ను రెండు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. డాక్టర్ ప్రదీప్ చౌబే మ్యాక్స్ హాస్పిటల్‌లో సింగ్‌కు ఆపరేషన్ నిర్వహించారు. రెండు రోజుల తర్వాత సింగ్ పార్లమెంటరీ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శస్త్ర చికిత్స అనంతరం దిగ్విజ‌య్ సింగ్ పూర్తిగా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.