Congress Protest: కేసీఆర్ డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. పిల్ల‌ర్లు ఊపితే మ‌ట్టి రాలుతోంది..?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పధకం పూర్తిగా నాసిరకంగా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథ‌కం పూర్తిగా నాసిరకంగా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని.. అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్ రూమ్ హామీని తుంగలో తొక్కుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. పేదలకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఎప్పుడు ఇస్తారో ఎమ్మెల్యేలు చెప్పాలని .. కేసీఆర్ ని అడగడానికి ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల‌ నిర్మాణం నాణ్యత చూస్తుంటే బాధతో కన్నీళ్ళు వస్తున్నాయని, ప్రజలు తమ కష్టార్జితంతో ఇచ్చిన టాక్స్ లతో కడుతున్న ఇల్లు నాణ్యత చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ నిర్మాణాలు మట్టి లెక్క రాలిపోతున్నాయని, పిల్లరు పట్టుకొని ఊపితే సిమెంట్ రాలిపోతుందని కాంగ్రెస్ గ్రౌండ్ విజిట్ లో తేలింది. వందేళ్ళు ఉండాల్సిన ఇళ్ల‌కు వేసిన పిల్లర్లు పది రోజులకే కూలిపోతున్నాయని, పేదలకోసం కట్టే ఇళ్ళని ఇంత నాసిరకంగా నిర్మిస్తారా.. ? ఇళ్ళ నిర్మాణాలకు సిమెంట్ వాడుతున్నారా..? మట్టితో కడుతున్నారా..? అని ఏఐసిసి అధికారి ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదోళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతోందని, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చెప్పినన్ని జరగలేదని ఆయ‌న ఆరోపించారు. కట్టిన కొన్ని ఇల్లు కూడా పేదలకు కేటాయించడం లేదని.. నాణ్యతతో ఇళ్ళ నిర్మాణాలు పూర్తిచేసి పేదలకు ఇవ్వాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేసారు.