Site icon HashtagU Telugu

BRS: కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటోంది: బీఆర్ఎస్

KCR Injured

Will Kcr's Unexpected Strategies Work

BRS: బీఆర్ఎస్ పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం నందినగర్ లోని నివాసంలో బిఆర్ఎస్ అధినేత  కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కృష్ణా నదీ జలాల పై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ని వ్యతిరేకించారు. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని భావిస్తూ.. కేఆర్ఎంబికి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి రాష్ట్ర కాంగ్రేస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేఖ నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు.

ఈ సమావేశంలో కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందుబాటులోవున్న పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశం లో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీ హరీశ్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, శ్రీమతి సత్యవతి రాథోడ్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.