కర్ణాటక (Karnataka)లోని బెలగావి(Belagavi)లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి అధ్యక్షతన నిర్వహించిన ‘జై బాపు-జై భీమ్- జై సంవిధాన్'( ‘Jai Bapu, Jai Bhim, Jai Samvidhan’) సదస్సు ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (deputy cm bhatti vikramarka) పాల్గొన్నారు. మహాత్మా గాంధీ (Mahatma Gandhi) కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సదస్సు నిర్వహించబడింది.
IT Raids : ఆ హీరోలపై ఐటీ అధికారుల నజర్..?
ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్య్రం అందించి, ఆ తర్వాత రాజ్యాంగ రూపకల్పనకు మార్గం సుగమం చేశారని గుర్తు చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించేందుకు కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేసిందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రజల బాధ్యతగా నిలవాలని పిలుపునిచ్చారు. సదస్సులో మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ల కృషిని స్మరించుకున్నారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి రాజ్యాంగ నిర్మాణం వరకు వీరి పాత్ర అనన్యసామాన్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ చరిత్రనే దేశ చరిత్రగా భట్టి అభివర్ణించారు. సమానత్వం, న్యాయం, స్వాతంత్య్రం వంటి విలువల కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని గుర్తు చేసారు. ఈ సదస్సు ద్వారా సామాజిక సమానత్వం మరియు రాజ్యాంగ పరిరక్షణకు అందరి కృషి అవసరమని ఆకాంక్షించారు. ఈ సదస్సు ప్రజలలో రాజ్యాంగంతో పాటు మహానుభావుల కృషిని గౌరవించే స్పూర్తిని కలిగించడమే లక్ష్యంగా నిర్వహించబడిందని ఆయన అన్నారు.