Bandi Sanjay: బీఆర్ఎస్ తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దాలి: బండి సంజయ్

  • Written By:
  • Publish Date - January 29, 2024 / 01:29 PM IST

Bandi Sanjay: బీజేపీ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ లో పలు అభివ్రుద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సర్పంచులు వచ్చే వారం నుండి ఆందోళన చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు చూశానని, సర్పంచుల పోరాటం న్యాయమైనదని, మా పార్టీ నాయకత్వంతో మాట్లాడి సర్పంచుల పోరాటానికి మద్దతిస్తానని వివరణ ఇచ్చారు. తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం వచ్చే నెల 1న ముగియబోతుందని, సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఝప్తి చేశానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశానని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ తప్పిదాలను, సర్పంచులకు చేసిన మోసాలను సరిదిద్దాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని, లేనిపక్షంలో బిఆర్ఎస్ మాదిరిగా కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని బండి సంజయ్ హెచ్చరించారు. చాలామంది సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాక అప్పులపాలై కూలీలుగా, పెట్రోల్ బంకుల్లో పనిచేసే దుస్థితి ఏర్పడిందని, చాలా చోట్ల సర్పంచులు చేసిన పనులను రికార్డుల్లో నమోదు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించిన చరిత్ర కెసిఆర్ ప్రభుత్వానికి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి కెసిఆర్ ప్రభుత్వంపై కేసు పెట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బిఆర్ఎస్ మాదిరిగా నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

కెసిఆర్ కుమారుడు కెటిఆర్ తనపై అవాకులు, చవాకులు పేలుతున్నారని, కెసిఆర్ కు సిఎం పదవి ఎందుకు? అని, బార్ పెట్టుకుంటే సరిపోతుంది కదా? విమర్శలు గుప్పించారు. నువ్వు మాట్లాడితే ముస్లింల గురించి మాట్లాడుతున్నవ్ కదా.. హిందూ ధర్మమంటే కెటిఆర్ గిట్టదని, మసీదు పెట్టుకోవాలని, కెటిఆర్ కు రాజకీయాలెందుకు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.