BRS Leader: స్కాం లతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతుంది: క్రిశాంక్

  • Written By:
  • Updated On - June 16, 2024 / 12:07 AM IST

BRS Leader: స్కాం లతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతుందని బిఆర్ ఎస్ నేత క్రిశాంక్ అన్నారు. లిక్కర్ నుండి మొదలు బియ్యం స్కామ్ వరకు అన్ని స్కాం లే అని, పొన్నం ప్రభాకర్ మరో కుంభకోణం చేశారని, ఆర్టీసి లో ఒక పెద్ద టెండర్ గోప్యంగా ఉంచి పెద్ద స్కాం చేశారు..లో లోపల ఈ స్కాం జరిగిందని ఆయన అన్నారు.

అంత పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు వెబ్ సైట్ లో ఎందుకు లేదు అని, 2023 ఫిబ్రవరి లో గత ప్రభుత్వం పెట్టిన టెండర్లను ఎందుకు రద్దు చేసారని, 11 జనవరి 2024 లో ఆర్టీసి వెబ్ సైట్ లో ఆన్లైన్ టెండర్లను అఫ్ లైన్ ఎందుకు చేసారని క్రిశాంక్ అన్నారు. ఫిజికల్ గా బస్ భవన్ లో టెండర్లు సబ్మిట్ చేస్తే ఎన్ని టెండర్లు వచ్చాయి ఎవరు ఎంత కోట్ చేసారు అనే విషయాలు ఎందుకు బయట పెట్టడం లేదు అని ఆరోపించారు.

నెల రోజుల్లోనే హుటాహుటిన 14 అమాండ్ మెంట్స్ తీసుకురావడం లో మతలబు ఏంటి అని, ఛలో మొబిలిటీ అనే కంపెనీకి 13 వేల 200 టికెట్ మెషీన్ల కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు అని, ప్రతి రోజు 30 లక్షల టిక్కెట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యు అయితే ప్రతి టిక్కెట్ కమిషన్ నేరుగా ఆ సంస్థకు వెళ్తుందని అన్నారు.