Jeevan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1500కోట్ల వడ్ల కుంభకోణానికి పాల్పడింది: జీవన్ రెడ్డి

  • Written By:
  • Updated On - April 13, 2024 / 06:21 PM IST

Jeevan Reddy:  తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1500కోట్ల వడ్ల కుంభకోణానికి పాల్పడిందని ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూకాంగ్రెస్ అవినీతి పై ఈడీ, ఐటీ లకు పిర్యాదు చేస్తానని వెల్లడించారు. గోదాముల్లో నిలువ ఉన్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్లు పిలిచి రూ 1600 కు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మిందన్నారు.ఈ మొత్తం వ్యవహారం లో రూ 1450 కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన తెలిపారు. రేవంత్ సర్కార్ అవినీతికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ నెత్తిపై కాంగ్రెస్ అవినీతి కత్తి వేలాడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

డబుల్ ‘ఆర్’ (రాహుల్-రేవంత్ రెడ్డి) ట్యాక్స్ వసూళ్ళలో లో ఫస్ట్ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం
ఆరు గ్యారెంటీల అమలులో లాస్ట్ ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటేనే ఫాదర్ ఆఫ్ కర్పెక్షన్.
కాంగ్రెస్ హస్తం అవినీతి నేస్తం. అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇండియన్ నేషనల్ కర్పెక్షన్ పార్టీ.జలయజ్ఞం,2జీ, భూపందారాలు, ఆగస్టా, కోల్-ఇలా పంచభూతాలను బోంచేసిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్, అవినీతి రెండూ రాహుకేతువులు లాంటివి. కాంగ్రెస్, కర్పెక్షన్ కవల పిల్లలు. కాంగ్రెస్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజలను గాలికొదిలేసింది. పైసా కమావో బాట పట్టింది. కాంగ్రెస్ అంటేనే ఎలెక్షన్, సెలక్షన్, కలెక్షన్. ఆరు గ్యారెంటీలు బుట్ట దాఖల య్యాయి. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను గోతిలో పాటిపెట్టారన్నారు.

స్కీములు నిల్, స్కాములు ఫుల్. బీఆర్ఎస్ హయాంలో వడ్లు దేశమంతా ఎగుమతి అయితే కాంగ్రెస్ తెలంగాణ నుంచి ఓట్ల కోసం కోట్లాది రూపాయల నోట్లు ఎక్స్ పోర్ట్ చేస్తున్నది. అవినీతి పాఠాల్లో కాంగ్రెసు కే ఫస్ట్ మార్క్. ఏ ఫర్ ఆదర్శ్. బీ ఫర్ బోఫోర్స్. సీ ఫర్ కామన్ వెల్త్ స్కామ్, డీ ఫర్ దేవాస్ యాంత్రిక్స్- ఇలా ఏ టూ జెడ్ కాంగ్రెస్ కరప్షన్ కహానీలే అని జీవన్ రెడ్డి అన్నారు.