BRS party: మన్నె క్రిషాంక్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోంది : బీఆర్ఎస్ పార్టీ

  • Written By:
  • Publish Date - May 9, 2024 / 11:47 PM IST

BRS పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్స్ కళ్యాణ్ రావు, లలిత రెడ్డి, సదానంద్, వేణు, అమృతరావు, కార్తీక్ తదితరులు తెలంగాణ భవన్లో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ మీడియాతో మాట్లాడారు. ఒక తప్పుడు కేసు పెట్టి తెలంగాణ ఉద్యమకారుడు మన్నె క్రిషాంక్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా వేధిస్తుందో తెలంగాణ సమాజం గమనించాని అన్నారు. మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిషన్‌ ఇప్పటివరకు 6 సెషన్ కోర్టులకు బదిలీ అయిందని, ఈ రోజు ఈ కేసును 8వ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జికి బదిలీ చేశారని మండిపడ్డారు.

ఇదీ తెలంగాణలో నాలుగు నెలల ప్రజా పాలనలో జరుగుతున్న అణచివేత, హక్కుల తీరు అని, క్రిశాంక్ ఒక దళిత నాయకుడు ఉన్నత చదువులు, న్యాయ పరిజ్ఞానం, రాజకీయ నేపథ్యం ఉన్న క్రిశాంక్‌ ఎలక్షన్ కోడ్ ఉన్నాకూడా, అన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా, ఇలా తప్పుడు కేసులో అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నది రేవంత్ సర్కార్ అని ఆవేదన వ్యక్తం చేశారు.

క్రిశాంక్ గత తొమ్మిది రోజులుగా కస్టడీలోనే ఉంటున్నారని, సాధారణంగా ఇటువంటి కేసుల్లో అదే రోజు లేదా మరుసటి రోజు బెయిల్ పొందే అవకాశం ఉన్న పోలీసుల తప్పుడు కేసుల వల్ల అన్యాయంగా క్రిశాంక్ జైల్లోనే గత (9)తొమ్మిది రోజులుగా ఉండవలసి వస్తుందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.