TCongress: ఆ సీట్లపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్, గెలుపుపై కార్యాచరణ

  • Written By:
  • Updated On - February 26, 2024 / 11:14 AM IST

TCongress: తెలంగాణలో మొత్తం 17 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే  తెలంగాణ కాంగ్రెస్‌ మాత్రం 14 సీట్లు గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది. అంటే మిగతా సీట్లలో పోటీ తీవ్రంగా ఉండటంతో చాకచాక్యంగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. తెలంగాణలోని ఏ రాజకీయ పార్టీ అయినా… హైదరాబాద్‌ లోక్‌సభ సీటుకు అంత త్వరగా తమ లెక్కలోకి తీసుకోవు. అక్కడ ఎంఐఎంకి ఉన్న బలం దృష్ట్యా దాన్ని వదిలేసి చెబుతుంటాయి.పార్లమెంట్‌ ఎన్నికల టైంలో బీఆర్‌ఎస్‌ కూడా సారు, కారు, పదహారు అన్న నినాదాన్ని ఇచ్చిందే తప్ప 17 అనలేదు.

ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ 16 అని కూడా అనకుండా 14కే ఎందుకు ఫిక్స్‌ అయిందన్న ప్రశ్నకు సమాధానం వెదుకుతున్నాయి రాజకీయ వర్గాలు. అలాగే మిగిలిన రెండు సీట్లు ఎవరికి వెళ్తాయని కాంగ్రెస్‌ భావిస్తోందన్న చర్చ సైతం జరుగుతోంది. ఈసారి బీఆర్‌ఎస్ ఒకటి లేదా రెండు సీట్లకే పరిమితం అవుతుందని తొలి నుంచి జోస్యం చెబుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. అటు బీజేపీ కూడా డబుల్‌ డిజిట్‌ టార్గెట్‌ అంటున్నా.. తక్కువలో తక్కువ ఐదారు ఎంపీ సీట్లు గెలుస్తామన్న ధీమాతో ఉంది.

ఈ పరిస్థితుల్లో ఎవరెన్ని సీట్లు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఎక్కువ అన్నది మెయిన్‌ పాయింట్‌. అయితే ఈసారి జరిగే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఫాలో అయిన గెలుపు సూత్రాలను పార్లమెంట్ లో ఫాలో అవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.