భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హంతకులకు ఉరిశిక్ష విధించాలని కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. రెండు రోజుల పాటు శివమొగ్గలో పాఠశాలలు, కళాశాలలను మూసివేసి 144 సెక్షన్ విధించారు. ఈ హత్యకు కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ గొడవకు సంబంధం ఉందా అనే అంశంపై కూడా బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసు గురించి ప్రభుత్వం స్పందిస్తూ.. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని పట్టుకున్నారని, విచారణ జరుగుతోందని కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర అన్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులు ఉన్నట్లు భావిస్తున్నామని, అయితే వీరి వెనుక ఎవరున్నారో ఇంకా తెలియరాలేదని జ్ఞానేంద్ర అన్నారు.
I urge @BJP4Karnataka govt to arrest the murderers of Shivamogga Banjarang Dal party worker Harsha & ensure capital punishment for those culprits.#ಶಿವಮೊಗ್ಗ
— Siddaramaiah (@siddaramaiah) February 21, 2022