Site icon HashtagU Telugu

Aap Vs Congress : కేజ్రీవాల్ కు ఖర్గే కౌంటర్.. కేంద్రం ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ వైఖరి విషయంలో క్లారిటీ

Aap Vs Congress

Aap Vs Congress

Aap Vs Congress : ఇవాళ (జూన్ 23) బీహార్ రాజధాని పాట్నా వేదికగా విపక్షాల మీటింగ్ జరుగుతోంది.. 

ఈ మీటింగ్ లో కాంగ్రెస్ ను నిలదీస్తామని.. ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ పై దాని వైఖరిని ప్రశ్నిస్తామని ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్  చేసిన ప్రకటనపై కాంగ్రెస్ రియాక్ట్ అయింది.   

ఆ ఆర్డినెన్స్ కు సంబంధించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు కాబట్టి.. అంతకంటే ముందే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ జాతీయ  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం చెప్పారు. ఆ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలా ? వద్దా ? అనే దానిపై త్వరలోనే ఒక క్లారిటీకి వస్తామన్నారు. “ఆర్డినెన్స్ బిల్లుపై ఓటింగ్ అనేది పార్లమెంటు లోపల జరిగే అంశం.. దాని గురించి ఎక్కడపడితే అక్కడ ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు” అని పరోక్షంగా కేజ్రీవాల్ ను(Aap Vs Congress) ఉద్దేశించి ఖర్గే వ్యాఖ్యలు చేశారు. ఆ బిల్లును వ్యతిరేకించడమైనా .. బలపర్చడమైనా.. పార్లమెంట్  బయట జరగదని గుర్తుంచుకోవాలన్నారు.పార్లమెంటు సమావేశాలు  ప్రారంభం కావడానికి ముందు.. దాదాపు 20 విపక్ష పార్టీలు కలిసి ఆ బిల్లుపై ఏం చేయాలనేది డిసైడ్  చేస్తాయని ఖర్గే అన్నారు.

Also read : Wife-Husband-92 Rapes : భార్యకు మత్తుమందు ఇచ్చి.. 51 మందితో రేప్ చేయించిన దుర్మార్గుడు

“విపక్షాల మీటింగ్ కు కాంగ్రెస్ నాయకులతో పాటు  ఆప్ లీడర్లు కూడా వస్తున్నారు. మరి ఆర్డినెన్స్ గురించి వాళ్ళు బయట ఎందుకు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదు” అని కామెంట్ చేశారు.  “ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మాకు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వకపోతే.. విపక్షాల మీటింగ్ కు  ఆప్ వెళ్ళదు” అని ఆప్ పార్టీ వర్గాలు చెప్పాయంటూ గురువారం మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ తాజా వ్యాఖ్యలు చేసింది.  ఇవాళ ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మీటింగ్ జరగనుంది.

Exit mobile version