వరద బాధిత ప్రాంతాలను పర్యవేక్షించేందుకు, వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు రెండు కమిటీలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. వరదలపై హైకోర్టు ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మెట్టికాయలు వేసిన స్పందించడం లేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తీవ్రంగా ప్రభావితమైన గ్రామీణ ప్రాంతాలకు ఎలాంటి వైద్య సహాయం అందలేదని వరద సహాయ కమిటీ గుర్తించింది. ఉచితంగా మందుల పంపిణీని కోరుతున్నామని, జిల్లాల వారీగా నష్టాలను సమీక్షిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు
టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. సహాయ, పునరావాస కార్యక్రమాల్లో సహకరించేందుకు జిల్లాల్లోని పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేశామని, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గతంలో వరదల సమయంలో ముంపునకు గురైన ప్రజలకు రూ.10వేలు అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు కూడా అలానే అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నుంచి సహాయం పొందేందుకు టోల్ ఫ్రీ నంబర్లు 040 – 24602383 మరియు 040 – 24601254 నెంబర్లను అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు.