Site icon HashtagU Telugu

Breaking News: హ‌న్ముకొండ‌లో ఉద్రిక్త‌త‌, పోలీసుల‌కు గాయాలు

Warangal

Warangal

హ‌నుమ‌కొండ‌లో కాంగ్రెస్, బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఆ క్ర‌మంలో పోలీస్ స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ కు గాయాలు కావ‌డంతో లాఠీ చార్జి జ‌రిగింది. ఇరు వ‌ర్గాలు బాహాబాహీకి దిగ‌డంతో కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు నిలువ‌రించ‌లేక‌పోయారు. చివ‌ర‌కు లాఠీ చార్జి చేయ‌డంతో ప్ర‌స్తుతం వివాదం స‌ద్దుమ‌ణిగింది. అయిన‌ప్ప‌టికీ హ‌నుమ‌కొండ అంత‌టా స‌ర్వ‌త్రా ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. జ‌రిగిన సంఘ‌ట‌న‌పై కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి స్పందించారు. అగ్నిప‌థ్ వివాదానికి కార‌ణం మోడీ అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

అగ్నిప‌థ్ ను నిర‌సిస్తూ శుక్ర‌వారం కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు బీజేపీ స్థానిక కార్యాలయం ఎదుట ధ‌ర్నాకు దిగారు. దీంతో అక్క‌డున్న బీజేపీ కార్య‌క‌ర్త‌లు రంగంలోకి దిగారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం, ఘ‌ర్ష‌ణ చేసుకుంది. ప‌రిస్థితి చేయిదాటి పోయింద‌ని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు .అయిన‌ప్ప‌టికీ ఇరు పార్టీల కార్య‌క‌ర్త‌లు క‌ర్ర‌ల‌తో కొట్టుకున్నారు. కొంద‌రికి స్వ‌ల్ప గాయాలు అయ్యాయి. కార్ల అద్దాల‌ను ప‌గుల‌గొట్టారు. హ‌నుమ‌కొండ బీజేపీ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది.