Site icon HashtagU Telugu

Vaddiraju: కేసీఆర్ ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కుట్రలు : ఎంపీ వద్దిరాజు

Vaddiraju

Vaddiraju

Vaddiraju: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి టూటౌన్ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఖమ్మం తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన ఈ సమావేశంలో పార్టీ నగర శాఖ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు శీలంశెట్టి వీరభద్రం,పొన్నం వెంకటేశ్వర్లు,దోరేపల్లి శ్వేత, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,మన పార్టీ అధినేత కేసీఆర్ గారు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో మూడు రోజుల పాటు జరిపిన బస్సు యాత్ర, రోడ్ షోలు విజయవంతమయ్యాయని, ఇది చూసి ఓర్వలేక కాంగ్రెస్ -బీజేపీలు కుట్ర చేసి నోటీసులు ఇప్పించాయని అన్నారు.

మన పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పక్కా లోకల్,టూటౌన్ పరిధిలోని నెహ్రూ నగర్ నివాసి,  అలాగే,తనతో పాటు మన అభ్యర్థి నామ, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షులు మధు తదితర ప్రముఖులు టూటౌన్ పరిధిలోనే నివసిస్తున్నామని, నామ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, కాంగ్రెస్ అభ్యర్థి ఢిల్లీలో ఉంటారో, బెంగళూరులో నివసిస్తారో,ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి అని ఇంటింటికి వెళ్లి వివరించాలని అని అన్నారు. నామ గెలుపు చాలా అవసరం, పొరపాటున ఓడిపోయినట్టయితే మన జిల్లా,రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని, నామ గెలుపునకు మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని వద్దిరాజు అన్నారు.