Site icon HashtagU Telugu

Punjab: పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ల కలకలం.. ఏం తరలిస్తున్నారంటే!

Drones

Drones

Punjab: పంజాబ్ లోని బిఎస్ఎఫ్ గురుదాస్ పూర్ లో పాకిస్తాన్ డ్రోన్ల కలకలం రేగింది. భారత సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు తిరుగుతుండడంతో ఒక్కసారిగా ఆర్మీ అంతా అప్రమత్తం అయింది. పాకిస్తాన్ నుండి ఆయుధాలను, హెరాయిన్ మాదకద్రవ్యాలను స్మగల్ చేయడానికి వీలుగా ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే రక్షక దళం మాత్రం ఎంతో అప్రమత్తంగా ఉండి ఈ డ్రోన్లపై కాల్పులు జరిపి వాటిని వెనక్కి పంపాయి. దాదాపు వందల కాల్పులు జరిపిన తర్వాత డ్రోన్లు తిరుగు ముఖం పట్టాయి. తరచూ పాకిస్తాన్ వారికి సంబంధించిన డ్రోన్లు మన సరిహద్దుల్లో తిరుగుతుంటాయి.

ఇక గురుదాస్పూర్ సెక్టర్లో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో డ్రోన్లు తిరుగుతూ కనిపించడంతో దాదాపు 26 రౌండ్ల కాల్పులు జరిపారు. మధ్యలో ఆరుసార్లు తేలిక బాంబులను కూడా ద్రోన్ల కదలికను పసిగట్టడానికి ఉపయోగించారు. అయితే వెంటనే 10:48 కి BOP కస్సోవాల్‌లో డ్రోన్ శబ్దం రావడంతో అక్కడ 72 రౌండ్ల కాల్పులు జరపవలసి వచ్చింది. నాలుగు తేలికపాటి బాంబులను కూడా ఉపయోగించారు. ఈ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత బిఎస్ఎఫ్ వారు లోకల్ పోలీస్ సిబ్బందితో ఒకసారి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే చుట్టుపక్క ప్రాంతాల్లో మాత్రం అనుమానస్పద కదలికలు ఏవి కనిపించలేదని వెల్లడించడం జరిగింది.

కేవలం ఒక్క డిసెంబర్ నెలలో పంజాబ్ లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో 7 కిలోల హెరాయిన్ ను డ్రోన్ల ద్వారా అక్రమంగా తరలించారు. అందులో బిఎస్ఎఫ్ వారు 4.42 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది

Exit mobile version