Bengaluru: వామ్మో స్టూడెంట్స్ బాగుల్లో కండోమ్ లు, సిగరెట్లు.. షాక్ లో టీచర్స్, పేరెంట్స్?

తాజాగా బెంగళూరులోని ఒక పాఠశాలలో స్కూల్ యాజమాన్యం ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా విద్యార్థుల బ్యాగులలో నా

  • Written By:
  • Publish Date - December 1, 2022 / 08:25 PM IST

తాజాగా బెంగళూరులోని ఒక పాఠశాలలో స్కూల్ యాజమాన్యం ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా విద్యార్థుల బ్యాగులలో నా వస్తువులను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలేం జరిగిందంటే.. బెంగళూరులోని పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు క్లాస్ రూములకు ఫోన్లు తీసుకొస్తున్నారు అని ఫిర్యాదులు రావడంతో వెంటనే స్కూల్ యాజమాన్యం స్పందిస్తూ తనిఖీలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే స్కూల్ యాజమాన్యానికి స్టూడెంట్స్ దగ్గర ఫోన్లు, కండోమ్స్, ఓరల్ కాంట్రసెప్టివ్ లు, లైటర్స్, సిగరెట్స్, వైట్నర్లు దొరికాయి. వాటిని చూసిన స్కూల్ యాజమాన్యం ఒక్కసారిగా షాక్ అయ్యారు.

వెంటనే ఆ విషయాన్ని ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడంతో పేరెంట్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తల్లిదండ్రుల ఆ విషయంపై స్పందిస్తూ తమ పిల్లలు అసాధారణంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. అయితే క్లాసు రూమ్ లోకి సెల్ ఫోన్ లు తీసుకు వస్తున్నారని పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ ప్రాసెస్ మొదలు పెట్టడానికి ముందు సాధారణ తనిఖీలు చేద్దామని అనుకోగా అసోసియేటెడ్ మేనేజ్మెంట్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్ ఇన్ కర్ణాటకకు ఈ విజ్ఞప్తులు రావడంతో వెంటనే తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో మద్యం తాగడం, వోడ్కా షాట్స్ తీసుకోవడం అన్నది సాధారణంగా మారిపోయింది అని కర్ణాటక జనరల్ సెక్రటరీ డి శశికుమార్ తెలిపారు.

అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం అయ్యారు. స్కూల్లో కౌన్సిలింగ్ సదుపాయం ఉన్నప్పటికీ వారికి బయట కౌన్సిలింగ్ ఇప్పించాలని స్కూల్ యాజమాన్యం పేరెంట్స్ ని కోరారు. అందుకోసం విద్యార్థులకు పది రోజులపాటు సెలవులను మంజూరు చేసింది స్కూల్ యాజమాన్యం. అయితే 8,9, 10 తరగతుల విద్యార్థుల బ్యాగులు తనిఖీలు చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక 10వ తరగతి బాలిక బ్యాగులో కండోమ్ లు దొరకడంతో ఆమెను విచారించగా తోటి విద్యార్థులపై నిందను చేసింది. ఇది విద్యార్థులు అలా ఎందుకు ప్రవర్తించారో వాటితో ఏం చేస్తున్నారు అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.