Site icon HashtagU Telugu

Telangana: మెట్రో, ఆర్‌టీసీ బస్సులకు ఉమ్మడి ట్రావెల్‌ కార్డు

Telangana

New Web Story Copy 2023 07 20t213047.918

Telangana: ప్రయాణ సౌకర్యాన్ని మరింత సౌకర్యవంతం చేసే దిశలో తెలంగాణ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో, టీఎస్‌ఆర్‌టీసీ బస్సులకు ఉమ్మడి ట్రావెల్‌ కార్డును ప్రారంభించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు నిర్ణయించారు. దశలవారీగా ఎంఎంటీఎస్ రైళ్లు, అద్దె క్యాబ్‌లు, ఆటోలు, షాపులకు ఈ కార్డు వినియోగాన్ని విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

కామన్ మొబిలిటీ కార్డ్ ఇతర నగరాల్లో కూడా ఉపయోగించవచ్చని తెలిపారు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌. ఈ రోజు కేటీఆర్ అధ్యక్షన జరిగిన ఓ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌ని కలిగి ఉన్నాయి. ఈ కార్డు ప్రయాణానికి, టోల్ , రిటైల్ షాపింగ్ మరియు డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

Also Read: Allari Ramudu : సినిమా యావరేజ్.. కానీ కలెక్షన్స్ లెక్కపెట్టడానికి మాత్రం చేతులు నొప్పి వచ్చాయట..