తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా అధికారుల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. అయితే.. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 40 మంది మున్సిపల్ కమిషనర్ల (Commissioners Transfer)ను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. రేపటిలోగా ఆయా ప్రాంతాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 105 మందిని రూరల్ డెవలప్మెంట్ శాఖలో బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సీఈవో, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీవోలను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటే.. మరోవైపు, తెలంగాణ ఆబ్కారీశాఖలో 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది
సహాయ కమిషనర్లను కూడా బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వీరినే కాకుండా తెలంగాణలో పెద్ద ఎత్తున తహశీల్దార్లను సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్ల(ఆర్డీవో)ను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకే ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది. మల్టీజోన్-1లో 84, మల్టీజోన్-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
అయితే.. బదిలీలు అధికారుల్లో గందరగోళానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఒకే చోట ఉంటున్న అధికారులు స్థాన చలనం కలిగించాలనే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ బదిలీలు కొనసాగుతుండటంతో.. ఆయా అధికారుల్లో కొంతమేర ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల విషయానికొస్తే ఆయా పార్టీలు లోక్ సభ ఎన్నికల బరిలో దించే అభ్యర్థుల జాబితాలను రెడీ చేస్తున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఆధిక సంఖ్యలో పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలనే పట్టుతో ఉండటంతో.. కేంద్రంలో ఉన్న బీజేపీ అధిష్టానం సైతం తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
Read Also : Mahesh Babu : మహేష్ తో ఇండోనేషియా బ్యూటీ రొమాన్స్.. రాజమౌళి సూపర్ ప్లాన్..!