LPG cylinder: పెరిగిన ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరలు, ఒక్కసారిగా రూ.209 పెంపు

దేశంలో ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఈ రోజు అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల

LPG cylinder: దేశంలో ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఈ రోజు అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ. 209 పెంచాయి. ఈ ధరల పెంపు తక్షణమే అమలులోకి వస్తుందని చమురు సంస్థలు ప్రకటించాయి. చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.158 మేరకు తగ్గించిన నెల తర్వాత ఈ ధరను మళ్లీ పెంచారు. దీంతో ఢిల్లీలో సిలిండర్ రిటైల్ ధర ఇప్పుడు రూ. 1,731.50కు చేరుకుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ. 200 తగ్గించింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను సెప్టెంబర్ 1న రూ. 157 తగ్గించింది. తగ్గింపులో భాగంగా ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1522 కు చేరగా, ఇది వరకు ఈ ధర రూ. 1680గా ఉండేది. కోల్‌కతాలో రూ. 1636కు చేరగా, గతంలో రూ. 1802గా ఉంది. ముంబైలో ఈ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1640 నుంచి రూ. 1482కు దిగి వచ్చింది. కానీ ఈ ధరలు మరోసారి ప్రభుత్వం పెంచింది.

కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ప్రధాన నగరాల్లో ధరలు:
ఢిల్లీ – రూ.1,731.50
ముంబై – రూ.1684
లక్నో – రూ.1,845
చెన్నై – రూ.1,898
బెంగళూరు – రూ.1,813
కోల్ కత్తా – రూ.1,839

Also Read: Chandrababu – Hunger Strike : గాంధీ జ‌యంతి రోజున జైలులో చంద్రబాబు నిరాహార దీక్ష