Site icon HashtagU Telugu

Harish Rao: సిద్దిపేట జిల్లాకి రైలు రావడం గొప్ప వరం

Harishrao Cbn

Harishrao Cbn

Harish Rao: నీళ్లు, నిధులతో సిద్దిపేట కలలను నిజం చేసింది సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ పట్టించుకోలేదు అని, పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగిన సిద్దిపేట కి రైలు తెస్తాం అని అబద్ధాలు చెప్పారు అని హరీశ్ రావు అన్నారు. 2006 రైల్వే లైన్ మంజూరు అయ్యింది 33 శాతం రాష్ట్ర వాటా చెల్లించాలని చెప్పిందని, కేసీఆర్ రైల్వే లైన్ ని స్వయంగా రూపకల్పన చేశారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారారు కానీ రైల్వే లైన్ రాలేదు, ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఉన్నారు..ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించింది కేసీఆర్ అని హరీశ్ రావు అన్నారు. ఎన్నో ఏండ్ల తర్వాత సిద్దిపేట జిల్లాకి రైలు రావడం గొప్ప వరమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.