Site icon HashtagU Telugu

Lip-Lock Challenge: ‘లిప్ లాక్’ ఛాలెంజ్.. కాలేజీ స్టూడెంట్ అరెస్ట్!

Lip Lock

Lip Lock

వెస్ట్రన్ కల్చర్ ప్రభావమో, సోషల్ మీడియా క్రేజీనో.. కారణాలు ఏమైనా నేటి యువత వివిధ రకాల ఛాలెంజ్స్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఓ పేరొందిన కాలేజీ విద్యార్థులు లిప్ లాకింగ్ వీడియో చేశారు.  ఓ అమ్మాయిని ఓ అబ్బాయి ముద్దు పెడుతున్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో పోలీసులు స్టూడెంట్ ను అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.

కళాశాల విద్యార్థులు సరాదాగా లిప్ లాక్ ఛాలెంజ్ నిర్వహించారు. ఇతర అమ్మాయిలు వాళ్లను ఎంకరేజ్ చేస్తుండగా అబ్బాయి, అమ్మాయి లిప్ లాక్ చేసుకున్నారు. యూనిఫాంలో ఉన్న కాలేజీ విద్యార్థులు వారిని ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. ఈ కర్ణాటకలోని కోస్తా జిల్లాలో జరిగినట్టు తెలుస్తోంది. విషయం తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో కళాశాల అలర్ట్ అయ్యింది. లిప్ లాక్‌కి సంబంధించిన వీడియోలో యువకుడ్ని అరెస్టు చేశారు. ఈ వీడియోను ఓ విద్యార్థి ఒకరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని కూడా వర్గాలు తెలిపాయి. విద్యార్థులు డ్రగ్స్‌ సేవించారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

Exit mobile version