Andhra Pradesh : ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన క‌లెక్ట‌ర్ భార్య‌

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ భార్య కరుణ పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం

Published By: HashtagU Telugu Desk
baby

baby

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ భార్య కరుణ పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం మగబిడ్డకు జన్మనిచ్చింది. హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్, గైనకాలజిస్ట్ డాక్టర్ బి వాగ్దేవి, ఆమె బృందం క‌లెక్ట‌ర్ భార్య‌కు డెలివ‌రీ చేశారు. ఈ దంపతులకు మగ శిశువు రెండో సంతానం. నిశాంత్‌కుమార్‌ ఐటీడీఏలో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో వారి మొదటి సంతానం కూడా రంపచోడవరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జ‌న్మించాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు చాలా మెరుగుపడ్డాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గతేడాది అదే జిల్లా ఆసుపత్రిలో అప్పటి జాయింట్ కలెక్టర్ ఆనంద్ భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, ప్రజలు ఆసుపత్రుల్లో సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  Last Updated: 09 Nov 2023, 08:24 AM IST