Site icon HashtagU Telugu

Delhi: ఢిల్లీలో చ‌లిపులి.. వ‌ణికిపోతున్న ప్ర‌జ‌లు

cold wave

cold wave

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవడంతో ప్ర‌జ‌లు చలితో వణికిపోయారు. భారత వాతావరణ విభాగం ప్రకారం.. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో గరిష్ట ఉష్ణోగ్రత 14.8 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాలకు 10 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగానూ, కొండ ప్రాంతాల్లో 0 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగానూ ఉంటే చలి రోజుగా IMD చెబుతోంది. ‘చల్లని రోజు’లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే కనీసం 4.5 నుండి 6.4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండాలి.

సోమవారం తెల్లవారుజామున నుంచే పొంగ‌మంచు ద‌ట్టంగా క‌మ్ముకుంది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు నత్తనడకన సాగడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు కూడా పాక్షికంగా అంతరాయం ఏర్పడింది. గాలి వీయకపోవడంతో రోజంతా వాతావరణం ప్రశాంతంగా ఉంది. గ‌డిచిన 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు తక్కువగా 14.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.