Coimbatore DIG Suicide : తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది..
సాక్షాత్తు కోయంబత్తూరు రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీఐజీ), ఐపీఎస్ అధికారి విజయకుమార్ తన అధికారిక నివాసంలో సూసైడ్ చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆయన తన వెంట సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న గన్‌మ్యాన్ నుంచి పిస్టల్ లాక్కొని .. ఫైర్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి.
అయితే ఆయన సూసైడ్ ఎలా జరిగిందనే దానిపై ఇంకా ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
కోయంబత్తూరులోని రేస్ కోర్స్ సమీపంలో రెడ్ ఫీల్డ్స్‌లో ఉన్న తన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయకుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది . విజయకుమార్ తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నారని.. ఆయనకు ఇటీవల కౌన్సెలింగ్ కూడా జరిగిందని పలువురు చెబుతున్నారు. విజయకుమార్ తన కుటుంబాన్ని కొద్ది రోజుల క్రితమే చెన్నై నుంచి కోయంబత్తూరుకు తీసుకొచ్చారని అంటున్నారు. ఆయన సూసైడ్ చేసుకున్న వెంటనే నివాసం దగ్గరున్న భద్రతా సిబ్బంది సీనియర్ పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. డీఐజీ విజయకుమార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
Also read : New Executive Director: ఆర్‌బిఐ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పి. వాసుదేవన్.. ఎవరీ వాసుదేవన్..?
2009 బ్యాచ్ IPS అధికారి అయిన విజయకుమార్ ఈ ఏడాది జనవరిలోనే కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూర్‌లకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా, అన్నానగర్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్వీట్ చేస్తూ.. “అధికారి విజయకుమార్ అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతి కలిగింది. అతను జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా సహా వివిధ పాత్రలలో బాగా పనిచేశాడు. ఆయన మరణం తమిళనాడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు తీవ్ర నష్టం. అతని కుటుంబ సభ్యులకు మరియు పోలీసు బలగాల్లోని స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.