Site icon HashtagU Telugu

Cafe Positive : ‘కేఫ్ పాజిటివ్’.. స్పెషాలిటీ తెలుసా ?

Cafe Positive

Cafe Positive

Cafe Positive : ఇవాళ ‘వరల్డ్ ఎయిడ్స్ డే’. ఈసందర్భంగా మనం ఒక అరుదైన కాఫీ షాప్ గురించి తెలుసుకోబోతున్నాం.  ‘కేఫ్​ పాజిటివ్’ అనే కాఫీ షాపును 14 మంది యువకులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. అయితే వీరంతా హెచ్​ఐవీ పాజిటివ్​ వ్యక్తులే. సమాజంలో హెచ్​ఐవీపై ఉన్న ప్రతికూల ఆలోచనలను తొలగించే లక్ష్యంతోనే ఈ కేఫ్​ను సామాజిక కార్యకర్త డాక్టర్ కల్లోల్​ ఘోష్ ప్రారంభించారు. హెచ్​ఐవీ ఉన్న వ్యక్తులకు అవగాహన పెంపొందించడం, ఉపాధిని కల్పించటమే కేఫ్​ పాజిటివ్​ (Cafe Positive) ప్రధాన లక్ష్యం.

We’re now on WhatsApp. Click to Join.

కోల్‌కతాలోని 64ఏ లేక్​ వ్యూ రోడ్డు వద్ద గత మూడున్నర ఏళ్లుగా ‘కేఫ్​ పాజిటివ్‌’ (Cafe Positive)ను నిర్వహిస్తున్నారు. ఈ కాఫీ షాపు ట్యాగ్‌లైన్.. ‘‘కాఫీ బిహైండ్​ బౌండరీస్’’. ఈ కేఫ్‌కు​ విద్యార్థులు, నగరానికి చెందిన ప్రముఖులు తరచుగా వస్తుంటారు. ప్రస్తుతం సమాజంలో హెచ్​ఐవీ సోకిన వ్యక్తుల పట్ల ఉన్న ప్రతికూల ఆలోచనలను అధిగమించడానికి ఈ కేఫ్​ సహాయపడుతోంది.

Also Read: Rs 2000 Note: రూ. 2000 నోట్ల చలామణిపై ఆర్బీఐ కీలక ప్రకటన..!

సామాజిక కార్యకర్త డాక్టర్ కల్లోల్​ ఘోష్ దేశవ్యాప్తంగా ఇటువంటి 30కిపైగా టిఫిన్ సెంటర్స్‌ను  ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటిలో జాబ్స్ ఇచ్చేందుకు ఎయిడ్స్ పాజిటివ్ నిర్ధారణ అయిన దాదాపు 800 మందిని ఇప్పటికే ఎంపిక చేశారు. కోల్‌కతాలోని  కేఫ్‌ను నడుపుతున్న ఈ టీనేజర్లందరినీ హెచ్‌ఐవీ పాజిటివ్ కన్ఫార్మ్ అయిన తర్వాత వారి కుటుంబాలు వదిలేశాయి. అలాంటి వారిని డాక్టర్ కల్లోల్​ ఘోష్ చేరదీసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుండటం(Cafe Positive) స్ఫూర్తిదాయకం.