Site icon HashtagU Telugu

Coconut chicken curry: ఎంతో రుచిగా ఉండే కోకోనట్ చికెన్ కర్రీ తయారీ విధానం?

Coconut Chicken Curry

Coconut Chicken Curry

మామూలుగా మాంసాహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడే వంటలలో చికెన్ కూడా ఒకటి. చికెన్ తో చేసిన అనేక రకాల వంటకాలను ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. చికెన్ బిర్యానీ చికెన్ కబాబ్ చికెన్ రోల్స్ అంటూ రకరకాల రెసిపీలను తయారు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా సింపుల్గా ఈజీగా ఉండే కోకోనట్ చికెన్ కర్రీని తయారు చేశారా. మరి ఇంట్లోనే కోకోనట్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే అందుకు ఏ పదార్థాలు కావాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కోకోనట్ చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు :

చికెన్ – ఒక కిలో
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి – 2 రెబ్బలు
కొబ్బరి పాలు – రెండు కప్పులు
కొబ్బరి ముద్ – 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ – 1
ఎండుమిర్ – 4
పచ్చిమిర్చి – 4
కారం – టీస్పూన్లు
ఉప్పు – సరిపడా
పసుపు – టీస్పూన్
కొత్తిమీర తురుము – టేబుల్ స్పూన్

కోకోనట్ చికెన్ కర్రీ తయారీ విధానం:

ముందుగా పాన్ లో నెయ్యి వేసి వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, కొత్తిమీర తురుము వేసి వేయించాలి. చికెన్ ముక్కలు కూడా వేసి కొబ్బరి పాలు పోసి మరిగించాలి. తరువాత మంట తగ్గించి ఉప్పు, కారం వేసి కలిపి మూత పెట్టి సుమారు అర గంట ఉడికించాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్, నిమ్మరసం వేసి మూత పెట్టి కొద్ది సేపు ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ చికెన్ కర్రీ రెడీ.

Exit mobile version