Russia Ukraine Crisis: కోకా-కోలా, పెప్సికో బాటలోనే మెక్ డొనాల్డ్స్..రష్యాలో విక్రయాలు నిలిపివేత..!!

తన పొరుగుదేశం ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాను ఆర్థికంగా అరికట్టేందుకు ప్రపంచదేశాలు పలు విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే రష్యాలో వ్యాపార కలపాలు నిర్వహిస్తున్న ప్రముఖ కంపెనీలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

  • Written By:
  • Publish Date - March 9, 2022 / 09:46 AM IST

తన పొరుగుదేశం ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాను ఆర్థికంగా అరికట్టేందుకు ప్రపంచదేశాలు పలు విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే రష్యాలో వ్యాపార కలపాలు నిర్వహిస్తున్న ప్రముఖ కంపెనీలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కోకా-కోలా, పెప్సికోలు తమ వ్యాపారాలను నిలిపివేశాయి. తాజాగా మెక్ డొనాల్డ్, స్టార్ బక్స్ , జనరల్ ఎలక్ట్రిక్ సైతం తమ వ్యాపారాలను నిలిపిస్తున్నట్లు ప్రకటించాయి. రష్యా మీద ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున నిరసనల కారణంగానే ఇదంతా జరిగింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచీ..ప్రముఖ వాణిజ్య సంస్థలైనా మెక్ డొనాల్డ్స్ , కోకాకోలా, పెప్సికో, ఇతర ప్రధాన పాశ్చాత్య ఆహారా పానీయాల కంపెనీలను రష్యా నుంచి వైదొలగాల్సిందేనని ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఆయా బ్రాండ్స్ ను బహిష్కిరించాలని సోషల్ మీడియాలోపెద్దెత్తున ప్రచారం జరుగుతోంది.

Netflix, Levi’s, Burberry, Ikea వంటి ఇతర కంపెనీలు రష్యానుంచి వైదొలగాలన్న ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. గత వారం రోజుల నుంచి ‘BoycottMcDonalds’, ‘BoycottCocaCola’ హ్యాష్ ట్యాగ్ లు ట్విట్టర్ ట్రెండింగ్ మారాయి. వీటితోపాటు అనేక విదేశీ ఆహార, పానీయాల ఫ్రాంఛైజీల మీద కూడా ఒత్తిడి బాగానే పెరిగింది. కొకాకోలా, పెప్సికో, మెక్ డొనాల్డ్స్ రష్యాలో వ్యాపారం నిలిపివేసేంత వరకు అమెరికన్లను ఈ కంపెనీలకు ప్రొడక్టులకు దూరంగా ఉండాలని ప్రముఖ అమెరికన్ నటుడు, నిర్మాత సీన్ పెన్ పిలుపునిచ్చారు. దీంతో ఈ ప్రచారం పెద్దెత్తున ఊపందుకుంది.

ఈవిధంగా ప్రపంచవ్యాప్తగా కోకాకోలా, పెప్సికోలపై ఒత్తిడి పెరగడంతో రష్యాలో వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు కోకాకోలా, పెప్సికో ఇంతకుముందే ప్రకటించాయి. ఇఫ్పుడు తాజాగా మెక్ డొనాల్ట్స్ స్టార్ బక్స్, జనరల్ ఎలక్ట్రిక్ కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. మెక్ డొనాల్డ్ అధికారిక వెబ్ సైట్ ప్రకారం…కంపెనీ గతేడాది చివరి నాటికి రష్యాలో 847 రెస్టారెంట్స్ ఉన్నాయి. వీటి లోఎక్కువ భాగం కంపెనీ డైరెక్టుగా నిర్వహిస్తుంది. ఉక్రెయిన్ లో 108 రెస్టారెంట్లు ఉన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ మీద రష్యా దాడిని ఖండిస్తూ…ఆపిల్, వీసాలాంటి కంపెనీలు సైతం రష్యాలో కార్యకలాపాలను నిలిపివేశాయి.