తెలంగాణ (Telangana) లో ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్ (CM Revanth) ఢిల్లీ(Delhi)లో కొత్త నాటకం మొదలెట్టారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన వ్యవహారం తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉందని ట్వీట్ చేశారు. ‘ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ, నెలకు రూ. 2500, తులం బంగారం, రైతు భరోసా ఎవరికి ఇచ్చారు? రూ. 5లక్షల విద్యా భరోసా ఎక్కడ? ఇక్కడి హామీలకే దిక్కు లేదు.. ఢిల్లీలో హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా?’ అని ప్రశ్నించారు.
CM Chandrababu : నేడు సాయంత్రం టీడీపీ మంత్రులు, ఎంపీలతో చంద్రబాబు కీలక భేటీ..
ఇది ప్రజలను మోసగించడమేనని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణలోనే హామీలను అమలు చేయలేని రేవంత్, ఢిల్లీలో హామీలకు గ్యారంటీ ఇస్తారా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజల జీవన స్థితి మెరుగుపరచడంలో విఫలమైన రేవంత్ ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు మాయ మాటలు చెప్పి ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ లో నికృష్ట పాలన చేస్తున్న రేవంత్, దేశ రాజధానిలో కూడా అదే విధానాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు రేవంత్ అసమర్థతను గమనించి, నిజాలను అర్థం చేసుకుంటారని కేటీఆర్ నమ్మకం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజకీయ నాయకుల హామీలకు గౌరవం కల్పించడంలో ప్రజల చైతన్యం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు
తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి- ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండు
తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన – ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి
ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి ? -గ్యాస్… pic.twitter.com/JhIIxXW4fw
— KTR (@KTRBRS) January 17, 2025