తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల (Telangana Local Body Elections) పై సీఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరగాలని, ఇందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కీలకమైన పథకాలను అమలు చేయాలని సీఎం పేర్కొన్నారు.
SA20 League: ఎలిమినేటర్ మ్యాచ్‌లో సత్తా చాటిన సన్‌రైజర్స్
గ్రామాల్లో హామీల అమలు కోసం ఎమ్మెల్యేలు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని , స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో ఎకగ్రీవం సాధించడం, గ్రామాల అభివృద్ధికి ముందడుగు వేయడం ఎమ్మెల్యేల కర్తవ్యం అన్నారు. గ్రామాలలో సీసీ రోడ్లు, ఆలయాల నిర్మాణం, నిర్మాణ అనుమతులు వంటి ప్రాథమిక పనుల కోసం మంత్రుల అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో బీసీ లభ్యతకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ కులాలకు 42 శాతం స్థానిక సంస్థల పదవులు కేటాయించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ రీతిలో ప్రాధాన్యతనిచ్చేలా ఉంటుందని పేర్కొన్నారు.