CM Revanth Wishes: కార్మికుల‌కు మేడే శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం రేవంత్‌.. కేసీఆర్ కూడా..!

నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కార్మిక లోకానికి సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

  • Written By:
  • Updated On - May 1, 2024 / 11:14 AM IST

CM Revanth Wishes: నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కార్మిక లోకానికి సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు (CM Revanth Wishes) తెలిపారు. ప్రజాపాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ‘తెలంగాణ పునర్నిర్మాణానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు’ అని చెప్పారు. అంతేకాకుండా సీఎం రేవంత్ త‌న ఎక్స్ అకౌంట్ ద్వారా కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు. చెమట చుక్క.. కరిగిన కండరం.. శ్రమైక జీవన సౌందర్యం.. సకల తెలంగాణ ఆహార్యం. మేడే సందర్భంగా కార్మిక సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు.

Also Read: Bomb Threat Emails : పెద్దసంఖ్యలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. రాజధానిలో కలకలం

మీ శ్రమ ఫలమే సమస్త సంపదలు: కేసీఆర్‌

నేడు కార్మికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు కార్మికుల‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. తాజాగా రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ త‌న ఎక్స్ (ట్విట్ట‌ర్‌) అకౌంట్ ద్వారా కార్మికుల‌కు మేడే శుభాకాంక్ష‌లు తెలిపారు. కేసీఆర్ త‌న ఎక్స్ అకౌంట్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు. శ్రామిక జనుల విజయ స్ఫూర్తిని చాటే ‘మే డే’ సందర్భంగా.. తెలంగాణ కార్మిక లోకానికి శుభాకాంక్షలు. మీ శ్రమ ఫలమే సమస్త సంపదలు. మీకు శుభం చేకూరాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను అని రాశారు.

We’re now on WhatsApp : Click to Join

సీఎం, మాజీ సీఎంయే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కార్మికుల‌కు మేడే శుభాకాంక్ష‌లు తెలిపారు. వారి కోసం ప్ర‌త్యేక కార్యక్ర‌మాలు, అన్న‌దానం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు కూడా చేప‌ట్టారు. ఈరోజు మేడే కావ‌డంతో కార్మికులంద‌రూ హాలిడే తీసుకుని ర‌కర‌కాల కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. రాష్ట్ర‌మంతా కార్మికుల దినోత్స‌వంతో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది.