Site icon HashtagU Telugu

CM Revanth Reddy : నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్‌

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : నూతనంగా విధుల్లో చేరనున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు బుధవారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో 1100 మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకోనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీనియర్‌ అధికారులు, జిల్లా కలెక్టర్‌లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి కొత్తగా నియామకమైన ఉపాధ్యాయుల జాబితా ఖరారుపై ఆరా తీశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కలెక్టర్లందరికీ తెలియజేశామని, అభ్యర్థులకు సమాచారం అందించామని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి వెంకటేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Singer Sunitha : సింగర్ సునీత కాపురంలో చిచ్చుపెట్టిన యూట్యూబర్ ..?

బస్సులకు పార్కింగ్, దిగే స్థలాలను ఎస్పీలకు తెలియజేశామని అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. పోలీసు శాఖకు చెందిన 33 మంది నోడల్ అధికారులు ఆర్టీసీ, విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బస్సులు సజావుగా వెళ్లేలా, అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభాస్థలికి చేరుకుంటారు. అభ్యర్థులను తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సులన్నీ షెడ్యూల్‌ సమయానికి అనుగుణంగా వారి వారి ప్రాంతాల నుంచి బయలుదేరేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. అభ్యర్థులు ఇంటికి చేరే వరకు ఆయా శాఖల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ఎల్‌బీ స్టేడియంకు చేరే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు అధికారులు. వీటిలో ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్, సమన్వయ అధికారిని నియమించారు. జిల్లా బస్సుల కోసం పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయబడతాయి.

అయితే.. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యా శాఖ ఇటీవల 11,000 డీఎస్సీ పోస్టుల‌కు సంబంధించి నోటిఫికేషన్ ఫలితాలను నిన్న విడుదల చేసింది. మంగళవారం, విద్యా శాఖ వివిధ జిల్లాల ఆధారంగా ఈ పోస్టుల సమాచారాన్ని వెల్లడించింది. మొత్తం 11,062 పోస్టులలో, 10,006 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, మిగిలిన 1,056 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ ఎంపికలో కొన్ని అభ్యర్థులు కోర్టు కేసుల వంటి ఇతర కారణాల వల్ల ఇంకా తుది స్థితికి రాలేదని అధికారులు పేర్కొన్నారు.

New Ration Cards : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు.. మార్గదర్శకాలు ఇలా..!

Exit mobile version