Site icon HashtagU Telugu

CM Revanth Reddy : సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌ను సందర్శించి, అక్కడ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు అర్పించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. తరువాత సీఎం నేరుగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగే పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు జపాన్ బృందం ప్రత్యేక అతిథులుగా హాజరైంది. పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసు కవాతు అనంతరం, ఉత్తమ సేవలందించిన పోలీసు సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి మెడల్స్ అందజేయనున్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజును పురస్కరించుకుంటూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో దశాబ్దాల పాటు పోరాటం చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. పదేళ్ల ఆజాత్యాన్ని తిరస్కరించి ప్రజల ఆశయాలతో కూడిన ప్రభుత్వం ఏర్పడినట్లు చెప్పారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ ఆగమాగం ఏర్పడిన పరిస్థితిని బలోపేతం చేస్తోన్నట్లు, వ్యవస్థలను స్వతంత్రంగా, సమర్థవంతంగా పనిచేసేలా మార్చినట్టు వివరించారు.

Sensational : పాకిస్థాన్, దుబాయ్‌కి మానవ అక్రమ రవాణా.. హర్యానా శివాలయంలో దొరికిన రహస్య లేఖలో సంచలనం..!

దేశానికి అన్నం పట్టే రైతులకు భూమి సమస్యలు లేకుండా చక్కటి పరిష్కారాలను అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే ప్రభుత్వం భూభారతి అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టిందని చెప్పారు. భూభారతి రైతుల హక్కుల పరిరక్షణకు ఓ రక్షణ చట్టంగా పనిచేస్తుందని వివరించారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, అధికారులు నేరుగా అన్నదాతల ఇంట్లోకి వెళ్లి వారి భూ సంబంధ సమస్యలను తక్షణమే పరిష్కరించే వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇక ఉద్యోగ భర్తీలో దేశంలోని ఎలాంటి ఇతర రాష్ట్రం చేయని విధంగా ఘన కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం ఒక ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. పెట్టుబడుల ద్వారా లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు సృష్టించినట్టు వివరించారు. నిరుద్యోగుల విశ్వాసాన్ని సొంతం చేసుకున్న విధంగా ఉద్యోగ భర్తీ చేస్తున్నామన్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని, దేశ యువతలో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ రాకపోవడం బాధాకరమని ఆయన తెలిపారు.

CM Chandrababu : తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలి