Site icon HashtagU Telugu

CM Revanth : విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanthyoung India Polic

Cm Revanthyoung India Polic

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) విద్యా రంగంలో మరో విప్లవాత్మక అడుగు వేశారు. మంచిరేవులలో తొలి “యంగ్ ఇండియా పోలీస్ స్కూల్” (Young India Police School )ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మరియు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ స్కూల్‌ అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందించింది. CBSE సిలబస్‌తో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన చేపట్టాలని సీఎం వెల్లడించారు.

KalyanRam : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కళ్యాణ్ రామ్ , విజయశాంతి

పోలీసు కుటుంబాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్‌లో 50% సీట్లను పోలీస్ సిబ్బంది కుటుంబాలకు రిజర్వ్ చేయగా, మిగతా సీట్లను సివిలియన్ల పిల్లలకు కేటాయించారు. ఇది సామాజిక సమానత్వానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఈ పాఠశాలలో విద్యార్థులకు అకాడెమిక్ మరియు ఫిజికల్ ట్రైనింగ్ రెండింటినీ సమతుల్యంగా అందించనున్నారు.

ప్రారంభోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడి, వారిలో ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థుల సరదా, స్పోర్ట్స్‌పై తమ ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతను ఈ చర్య ద్వారా రుజువుచేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ఆయన స్పష్టం చేశారు.