Musi : ఎవ్వరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా : సీఎం రేవంత్‌ రెడ్డి

Musi : నల్గొండ జిల్లాలో కృష్ణమ్మలో కలుస్తుంది. అద్భుతమైన త్రివేణీ సంగమంగా.. మూసీ, ఈసా, కృష్ణానది ఉంటాయి. ఇవాళ వేలమంది యువకులు నన్ను ఆశీర్వదించాలని తరలివచ్చారు. ఉదయం నుంచి నాతోనే ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
CM Revanth Reddy Padayatra

CM Revanth Reddy Padayatra

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేపట్టారు. ఈ మేరకు ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంగెం నుంచి.. నాగిరెడ్డి పల్లి వరకూ 2.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తర్వాత ధర్మారెడ్డి పల్లి గూడెంలో ప్రసంగిస్తూ..మూసీని ప్రక్షాళన చేయకపోతే తన జన్మ ఎందుకు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎవ్వరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా అన్నారు. అవ్వరు అడ్డు వస్తారో రండి.. బుల్డోజర్ తో తొక్కించి ముందుకు వెళ్తా. 30 రోజుల్లో మూసీ ప్రక్షాళనకు డిజైన్లు ఖరారు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మూసీ విషంగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నాయి. జెండా, అజెండా పక్కన పెట్టి మూసీ ప్రక్షాళనకు సహకరించండి. ఎవ్వరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా అన్నారు .2025 నూతన సంవత్సరం వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు కదం తొక్కుతాం. మూసీ నది ప్రక్షాళన చేపడుతాం. బిల్లా, రంగలు రావాలి. వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుంకు రాయి కట్టి మూసీ నదిలో వదులుతారు. నడుస్తామన్న హరీశ్ రావు మీ సవాల్ ని స్వీకరిస్తున్నా. వాడపల్లిలో మూసీ కృష్ణా నదిలో కలిసే వద్ద పాదయాత్ర మొదలవుతుంది. జనవరిలో వాడపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. హరీశ్ రావు సవాల్ ను స్వీకరిస్తున్నానని.. దమ్ముంటే హరీశ్ రావు, కేటీఆర్ రావాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్ విసిరారు.

ఈ మూసీకి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణలో పుట్టి.. తెలంగాణలోనే ప్రవహించి.. నల్గొండ జిల్లాలో కృష్ణమ్మలో కలుస్తుంది. అద్భుతమైన త్రివేణీ సంగమంగా.. మూసీ, ఈసా, కృష్ణానది ఉంటాయి. ఇవాళ వేలమంది యువకులు నన్ను ఆశీర్వదించాలని తరలివచ్చారు. ఉదయం నుంచి నాతోనే ఉన్నారు. నల్గొండ సోదరులు అన్నం తినకుండా.. ఉపవాసం ఉండి మరీ నాకు అండగా నిలబడ్డారు. మూసీ నదిని పునరుజ్జీవింప జెయ్యాలి అని కోరుకుంటున్నారు. తమ జీవితాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు” అని సీఎం రేవంత్ అన్నారు.

కాగా, బీఆర్ఎస్ నేతల పదేళ్ల దోపిడీ బయటపడుతుందన్న భయంతోనే అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు..రేవంత్‌రెడ్డి. ఈటల రాజేందర్‌ పార్టీ మారినా ఇంకా బీఆర్‌ఎస్‌ పక్షానే మాట్లాడుతున్నారని..మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు మూసీ ఒడ్డున క్యాట్‌వాక్‌ చేయకుండా.. వారం రోజులు అక్కడే నివసిస్తే అక్కడి ప్రజల ఇబ్బందులు తెలుస్తాయని రేవంత్‌రెడ్డి అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు గంగ, యుమున, సరస్వతి అనే పేర్లతో పాటు మూసీ పేరు కూడా పెట్టే విధంగా ఆ నదిని ప్రక్షాళన చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Read Also: Cyclonic Storm: చలికాలం వ‌చ్చింది.. అయినా వ‌ద‌ల‌ని వ‌ర్షాలు, ఈ రాష్ట్రాల్లో వాన‌లు ప‌డే అవ‌కాశం!

 

  Last Updated: 08 Nov 2024, 07:10 PM IST