CM Revanth Reddy : నా ప్రతీ కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా ఉన్నారు..

సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ కొడంగల్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. నా ప్రతీ కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Published By: HashtagU Telugu Desk
Revanth Reddyf

Revanth Reddyf

సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ కొడంగల్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. నా ప్రతీ కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత చేసిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఈ ప్రాంతానికి సిమెంటు పరిశ్రమలు రాబోతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నా.. గత పాలకుల నిర్లక్ష్యంతో పరిశ్రమలు రాలేదని, పరిశ్రమలు ఏర్పాటు జరిగితే ఈ ప్రాంతంలో భూముల విలువలు పెరుగుతాయని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాకుండా.. మన ప్రాంతానికి ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, భూసేకరణకు సహకరిస్తేనే పరిశ్రమల ఏర్పాటు సులభతరం అవుతుందని, భూసేకరణలో పట్టా భూములకు,అసైన్డ్ భూములకు ఒకే ధర చెల్లించాలని అధికారులకు స్పెషమైన ఆదేశాలు ఇచ్చామని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. అభివృద్ధికి సహకరించకపోతే ఈ ప్రాంతం నష్టపోతుందని, నేను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్ పై ఉంటుంది.. మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుకుంటానని ఆయన కొడంగల్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. మీకు మేలు జరగాలని.. ఈ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు తీయాలన్నదే నా ఆకాంక్ష అని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

నేను ఎంత పెద్ద నాయకుడినైనా కొడంగల్ కుటుంబ సభ్యుడినేనని ఆయన కొడంగల్‌పై తనకున్న అప్యాయతను పంచుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కొడంగల్ నియోనకవర్గం నుంచి 50 వేల మెజారిటీ అందించాలని, మండల, బూత్, నియోజకవర్గ స్థాయిలో ఐదుగురు సభ్యుల చొప్పున సమన్వయ కమిటీ నియమించుకోవాలని ఆయన కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. మళ్లీ నేను ఏప్రిల్ 8న ఇక్కడకు వస్తానని, మండలాల వారీగా సమన్వయ కమిటీలతో సమావేశమవుతానని ఆయన వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని, ఏప్రిల్ 6న సాయంత్రం 5గంటలకు తుక్కుగూడలో జరిగే సభకు నియోజకవర్గం నుంచి భారీగా తరలి రండని ఆయన పిలుపునిచ్చారు.

Read Also : Chandrababu : ఐదేళ్లలో సీఎం జగన్‌ చేసిందేమీ లేదు..

  Last Updated: 28 Mar 2024, 06:15 PM IST