Satya Nadella : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని సత్య నాదెళ్ల నివాసానికి వెళ్లిన సీఎం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వెంట సీఎస్ శాంతికుమారి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ప్రతిపాదనలు, ఏఐ సిటీలో ఆర్‌అండ్‌డీ ఏర్పాటుకు సహకారంపై చర్చించారు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చర్చిస్తూ.. క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కోరారు.
ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్ ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ సీఈవోకు సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నాలుగు డేటా సెంటర్లు, హైదరాబాద్ కేంద్రంగా విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ సెంటర్‌లో సుమారు 4 వేల ఉద్యోగాలు వచ్చే విధంగా ఇటీవల ఒప్పందాలు జరిగాయి. దీనికి సంబంధించిన పురోగతిపైనా సత్యనాదెళ్లతో చర్చించినట్లు తెలుస్తోంది. సత్య నాదెళ్ల ప్రస్తుతం హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సత్య నాదెళ్ల మధ్య ఇది తొలి భేటీ కావడం విశేషం. ఈ సమావేశాన్ని గేమ్ ఛేంజర్‌గా ఐటీ ఇండస్ట్రీ భావిస్తోంది. ప్రపంచంలో పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ కావాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముదుకెళ్తోంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
Read Also: Dalai Lama : దలైలామా వారసత్వంపై ఉత్కంఠ