CM Revanth Reddy : నూతన మద్యం బ్రాండ్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కంపెనీలకు అనుమతులు ఇవ్వడంలో పారదర్శకతను పెంచే విధానాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ కాలంలో ఎప్పుడు పడితే అప్పుడు కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే విధానం ఉండేది, కానీ ఇకపై ఈ ప్రక్రియ కట్టుదిట్టంగా జరుగుతుందని, నిర్దిష్ట సమయంలోనే దరఖాస్తులు స్వీకరించాలని సీఎం సూచించారు.
మూడు ముఖ్యమైన అంశాలు
నాణ్యత, మార్కెట్ ఆదరణ, సరఫరా సామర్థ్యం: కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే సమయంలో వాటి నాణ్యత, మార్కెట్లో వాటికి ఉన్న ఆదరణ, సరఫరా సామర్థ్యం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని సీఎం తెలిపారు.
నాసిరకం కంపెనీలకు నో ఎంట్రీ: “ఇష్టమోచ్చిన చెత్త పేర్లతో వచ్చిన నాసిరకమైన కంపెనీలకు అనుమతి ఇవ్వడంలేదు” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకునే బీరు బ్రాండ్లపై చెక్ పెట్టాలని, కొత్త బ్రాండ్లకు సంబంధించి బీరు బిర్యానీ వంటి ప్రస్తుతానికే తగ్గించాలని పేర్కొన్నారు.
పాత కంపెనీలకు సులభతరం: ఇప్పటికే మద్యం సరఫరా చేస్తున్న పాత కంపెనీలకు కొత్త బ్రాండ్లు తీసుకురావడంలో ఏమీ ఇబ్బంది లేకుండా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ విధానం అనుసరించాలని సీఎం సూచించారు.
మైక్రో బ్రూవరీలు, ఎలైట్ బార్లు, మద్యం షాపుల కేటాయింపులు
మైక్రో బ్రూవరీలు, ఎలైట్ బార్ల అప్లికేషన్లు, ఖాళీగా ఉన్న మద్యం షాపుల కేటాయింపుల విషయంలో త్వరలో కొత్త విధానాలు ప్రవేశపెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో టానిక్ వంటి ఎలైట్ షాపులకు అనుమతులు ఇచ్చినప్పుడు పెద్ద వ్యాపారులు ఎక్సైజ్ శాఖను తమ ప్రయోజనాలకు వాడుకున్నారు, తద్వారా భారీగా ప్రభుత్వ ఆదాయాన్ని తప్పుడు మార్గంలో దొంగిలించారు.
ఎక్సైజ్ శాఖపై కట్టుదిట్ట నియంత్రణ
ఇకపై ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టంగా వ్యవహరించాలనే అవసరం ఉందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎక్సైజ్ ఆదాయం గండి పడకుండా తీసుకోవాల్సిన కొత్త ప్రతిపాదనలపై సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఈ నిర్ణయాల ద్వారా సర్కార్ నూతన మద్యం కంపెనీల నియంత్రణలో క్రమబద్ధత, పారదర్శకత , సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పరచాలని లక్ష్యం పెట్టుకుంది.
Satellites Handshake : ఇస్రో ‘స్పేడెక్స్ మిషన్’లో కీలక ఘట్టం.. రెండు శాటిలైట్ల కరచాలనం